🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 12 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కఠోపనిషత్ - 9 🌻
🌷. పంచమవల్లి / షష్ఠివల్లి 🌷
11. సూర్యోయథా సర్వలోకస్య చక్షు
ర్న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై:
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
న లిప్యతే లోకదు:ఖే; న బాహ్య: !!
యావత్ ప్రపంచానికే నేత్రుడైన సూర్యుడు.. చర్మచక్షువుల మాలిన్యాల వల్ల మలినుడు కానట్లే.. ప్రపంచానికి అతీతమైనది సకల జీవుల హృదయాల్లోనూ వున్నదీ అయిన ఆత్మ ప్రపంచపు దు:ఖాల వల్ల దు:ఖాన్ని ఎంతమాత్రమూ ఆత్మ మలినం కాదు.
12. ఏకోవశీ సర్వభూతాంతరాత్మ
ఏకం రూపం బహుధా య: కరోతి!
తమాత్మస్థం యే ను పశ్యంతి ధీరా
స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్!!
ఆ ఒక్క జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మను తన ఒక్క రూపాన్నే అనేక విధాలుగా కల్పించే దానిని తమ ఆత్మయందే వుందని దర్శించే ప్రాజ్ఞులు శాశ్వతమైన ఆనందం పొందుతున్నారు. ఇతరులకు అది సాధ్యం కాదు.
13. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానా
మేకో బహూనాం యోవిదధాతి కామాన్ !
తమాత్మస్థం యే నుపశ్యంతి ధీరా
స్తేషాం శాంతి: శాశ్వతీ నేతరేషామ్ !!
అనిత్య వస్తువులలో నిత్యవస్తువూ, చైతన్యవంతమైన వానిలోని చైతన్యమూ ఒక్కటే అయినా.. అనేకుల కోరికలను నెరవేర్చేది అయిన పరమాత్మను తమ ఆత్మయందే స్థితమై వున్న దానిగా ఏ ప్రాజ్ఞులు దర్శిస్తారో వారిదే శాశ్వతమైన శాంతి. ఇతరులది కాదు.
14. తదేతదితి మన్యంతే నిర్దేశ్యం పరమం సుఖమ్ !
కథం ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా!!
ఋషులు ఆ అనిర్వచనీయమైన పరమానందాన్నే ఇదే అది అని దర్శిస్తారు. దానిని నేనెలా తెలుసుకోగలను? అది తన కాంతితో స్వయంగా ప్రకాశిస్తుందా లేక మరొకదాని కాంతి వల్ల మెరుస్తుందా?
15. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని: !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి!!
అక్కడ సూర్యుడు ప్రకాశించడు.. చంద్రుడు, నక్షత్రాలు కనిపించవు. మెరుపులు కూడా మెరవలేవు. ఇక ఈ అగ్ని మాటెందుకు? అది ప్రకాశిస్తూ వుంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగించబడుతున్నది.
🌷. షష్ఠివల్లి 🌷
1. ఊర్థ్వమూలో వాక్ శాఖ ఏషో శ్వత్థ: సనాతన: !
తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదే వామృతముచ్యతే!
తస్మింల్లోకా: శ్రితా: సర్వే తదు నాత్యేతి కశ్చన ! ఏతద్వై తత్ !!
ఈ సనాతనమైన అశ్వత్థ వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి వుంటాయి. కొమ్మలు కిందికి విస్తరించి వుంటాయి. ఇదే పరిశుభ్రమైంది. ఇదే బ్రహ్మం. దీనినే అమరం అనికూడా అంటారు. అన్ని లోకాలూ దీనియందే వున్నాయి. ఏదీ కూడా, ఎవరూకూడా దీనిని అతిక్రమించలేరు. నిజంగా ఇదే ఆత్మ.
2. యదిదం కించి జగత్సర్వం ప్రాణ ఏజతి ని:సృతమ్ !
మహద్బయం వజ్రముద్యతం య ఏతద్ విదురమృతాస్తే భవంతి!!
ప్రాణశక్తి ఉపస్థితమై వుండగా.. అతనినుండి యావద్విశ్వమూ బహిర్గతమై అతనిలోనే కంపనం చెందుతూ వుంటుంది. ఎత్తబడిన వజ్రాయుధంలాగా అతడు మహాభయంకరుడు. దీనిని తెలుసుకున్నవారే అమరులవుతారు.
3. భయాదస్యాగ్ని స్తపతి భయాత్తపతి సూర్య: !
భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్థావతి పంచమ: !!
అతని భయం చేతనే అగ్ని దహిస్తుంది. అతని భయంవల్లే సూర్యుడు ప్రకాశిస్తాడు. అతని భయం వల్లే ఇంద్రుడూ, వాయుదేవుడూ, అయిదవదైన మృత్యుదేవతా కూడా తమతమ విధులను అనుసరించి పరుగులు పెడతారు.
4. ఇహ చేదశకద్ బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రస:!
తత: సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే !!
ఆ బ్రహ్మాన్ని ఇక్కడే.. ఈ శరీర పతనానికి పూర్వమే సాక్షాత్కరించుకోగలిగితే.. మానవుడు ఈ సంసారబంధం నుండి విముక్తుడవుతాడు. లేకపోతే సృష్ఠిలోని అనేక లోకాలలో మళ్లీ మళ్లీ శరీర ధారణం చేయాల్సి వస్తుంది.
5. యథాదర్శే తథాత్మని
యథాస్వప్నే తథా పితృలోకే !
యథాప్సు పరీవ దదృశే తథతా గంధర్వలోకే
ఛాయా తపయోరివ బ్రహ్మలోకే !!
ఆ పరబ్రహ్మం మానవుడి ఆత్మయందు అద్దంలోలాగా స్పష్టంగా కనిపిస్తుంది. పితృలోకంలో కలలోలాగా కనిపిస్తుంది. గంధర్వలోకంలో నీటిలో ప్రతిఫలంలా కనిపిస్తుంది. బ్రహ్మలోకంలో వెలుగునీడల మాదిరి కనిపిస్తుంది.
6. ఇంద్రియాణాం పృథగ్బావముదయాస్తమయౌ చ యత్!
పృథగుత్పద్యమానానం మత్వా ధీరో న శోచతి!!
ఇంద్రియాల విభిన్న స్వరూపాన్నీ, వాటి విభిన్నమైన ఉత్పత్తినీ, వాటి ఉదయాస్తమయాలను తెలుసుకున్న ధీరుడు ఇక శోకించడు.
7. అవ్యక్తాత్తు పర: పురుష: వ్యాపకో లింగ ఏవ చ!
యం జ్ఞాత్వా ముచ్యతే జంతురమృతత్వం చ గచ్ఛతి !!
నిజంగా అవ్యక్తానికంటే మించింది సర్వవ్యాపీ, సర్వలక్షణ రహితమూ అయిన పురుషుడే. ఆ పురుషుని సాక్షాత్కరించుకోవడం వల్ల మానువుడు ముక్తుడై అమరుడవుతాడు.
9. న సందృశే తిష్ఠతి రూపమస్య
న చక్షుపా పశ్యతి కశ్చనైనమ్ !
హృదామనీషా మనసా భిక్లుప్తో
య ఏతద్ విదురమృతాస్తే భవంతి !!
అతని రూపం చూపు మేరలో లేదు. కన్నులతో ఎవడూ అతనిని చూడలేడు. హృదయంలో వుండి, మనస్సును శాసించే బుద్ధి స్ఫూర్తిచేత అతడు ప్రకటితుడవుతాడు. అతనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment