Wednesday, 1 July 2020

🌻. కేనోపనిషత్తు 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 3 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కేనోపనిషత్తు 🌻

మానవులకు మోక్షమార్గాన్ని చుపేవే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు అంతంలో వుండటం వల్ల వేదాంతం అంటారు. మానవ జీవితాన్ని తరింప జేసుకొనుటకు, మోక్షాన్ని అందుకొనుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించే ఉపనిషత్తులు నాలుగు వేదాలలోను మొత్తం 1180 ఉన్నవి. అయితే 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి.

ఓం నమో పరమాత్మయే నమః

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యుద్వాచో
హవాచం స ఉ ప్రాణస్య ప్రాణః
చక్షుషశ్చక్షు రతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమమృతా భవన్తి.

ఏది శ్రోత్రమునకు శ్రోత్రమో, మనస్సునకు మనస్సో, వాక్కునకు వాక్కో, ప్రాణమునకు ప్రాణమో, నేత్రమునకు నేత్రమో అదియే (అధిష్టాన) పరబ్రహ్మము. ధీరులగువారు ఈ జగద్బ్రాంతిని విడిచి ఈ లోకమునుండి (శరీరమునుండి) వెలువడి జననమరణ రహితులు అగుచున్నారు.

స త త్ర చక్షుర్గచ్చాతి న వాగ్గచ్చతి నో మనో
న విద్మో న విజానీయో యథైతదను   శిష్యా
దన్యదేవ తద్విదితాదథొ అవిదితా దధి
ఇతి శుశ్రుమ పూర్వేషాం యే న స్తద్వ్యాచచక్షిరే

ఆ బ్రహ్మము నోద్దకు నేత్రము పోవుటలేదు. వాక్కు పోవుటలేదు. మనస్సు పోవుటలేదు. కాబట్టి దానిని (భౌతిక వస్తువును వలె) ఎరుగలేము. ఏ ప్రకారము ఈ బ్రహ్మమును ఇతరునకు చెప్పనగునో తెలియలేము. ఆ బ్రహ్మము తెలియబడు ప్రపంచముకంటే వేరుగానే యున్నది. మరియు తెలియబడని అవ్యాకృతము కంటెను ఉత్తమమైనది. ఈ ప్రకారము ఏ ఆచార్యులు ఆ బ్రహ్మము గూర్చి మాకు చెప్పిరో, ఆ పుర్వచార్యుల వాక్యములను మేము వినుచున్నాము.

యన్మనసాన మనుతే యెనాహుర్మానో మతమ్
తదేవ బ్రహ్మ త్వం విడి నేదం యదిదముపానతే |

ఏది మనస్సుచేత మననము చేయబడజాలదో, దానిచేత మనస్సు మననశక్తి గలదిగా చెప్పుదురో దానినే నీవు బ్రహ్మముగా నేరుగుము. ఏ యీ (అధ్యస్తమగు) మనస్సును, దాని అధిదేవతను జనులు ఉపాసించుచున్నారో, ఇది బ్రహ్మము కాదు. 

యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః ,
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్ |

ఎవరు బ్రహ్మమును తెలిసికొనబడజాలనిదిగ ఎరుంగునో అతడు బ్రహ్మమును గూర్చి తెలిసికొనినవాడు. ఎవడు బ్రహ్మమును (భౌతికవస్తువు వలె) తెలిసికొంటినని ఎరుంగునో అతడు బ్రహ్మము నేరుంగనివాడే యగును. కాబట్టి (ఒకానొక దృశ్య పదార్థమును నలె) బ్రహ్మమును తెలిసికోనినామని తలంచువారు ఏమియు తెలియనివారనయు, బ్రహ్మమును (ద్రుశ్యవస్తువునువలె) తెలిసికొనజాలమని ఎరుగువారు తెలిసికొనినవారనియు ఎరుగవలయును.           

ఇహ చెదవేది దథ సత్య మస్తి
న చేదిహావేది న్మహతీ విసష్టి: ,
భూతేషు భూతేషు విచిత్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భపన్తి.

ఈ మనుష్య  జన్మయందు పరమాత్మను గూర్చి తెలిసికొనినచో, అతనికి సత్యమైన బ్రహ్మానందము సిద్దించుచున్నది, ఆ ప్రకారముగా ఈ జన్మయందు భగవంతుని గూర్చి తెలిసికొననిచో, గొప్ప వినాశము సంభవించుచున్నది. ధీరులగువారు సమస్తభూత కోట్ల యందును అద్వితీయాత్మ తత్వమును తెలిసికొని ఈ లోకము నుండి (శరీరము నుండి) వేరై జనన మరణ రహితులగుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment