Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 10 🌻 🌹

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 13 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  10 🌻

🌷. షష్ఠివల్లి 🌷

10. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ!
బుద్ధిశ్చ న విచేష్టతే తామాహు: పరమాం గతిమ్ !

మనస్సుతో సహా పంచేంద్రియాలూ ఎప్పుడు ఆత్మలో నిశ్చలంగా నిలిచిపోతాయో బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతోందో.. అప్పటి స్థితినే పరమపదమని అంటారు.

11. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణామ్ !
అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ!!

ఆ సుస్థిరమైన ఇంద్రియ నిగ్రహమే యోగం అనబడుతుంది. అప్పుడు యోగి అన్ని మనశ్చాంచల్యాల నుండి పొరపాట్లనుండి విముక్తుడవుతాడు. ఎందుకంటే యోగాన్ని పొందవచ్చూ, పోగొట్టుకోవచ్చు.

12. నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా !
అస్తీతి బ్రువతో న్యత్ర కథం తదుపలభ్యతే !!

ఆ ఆత్మ మాటలద్వారా, కన్నులచేతా, మనస్సుచేతా కూడా పొందడానికి సాధ్యపడేది కానేకాదు. అది వున్నది అని చెప్పేవారి నుండే దాన్ని పొందాలి. ఇతరత్రా పొందడం ఎలాగా?

13. అస్తీత్యేవో పలబ్ధవ్యస్తత్త్యభావనే చోభయో:!
అస్తీత్యేవోపలబ్ధస్య తత్త్వభావ: ప్రసీదతి !!

ఈ రెండింటిలో సత్తే అసలు తత్త్వంగా సాక్షాత్కరించుకోవాలి. అలా సత్తను సాక్షాత్కరించుకున్నవానికే అసలు తత్త్వం ప్రత్యక్షమవుతుంది.

14. యదా సర్వే ప్రముచ్యంతే కామాయే స్య హృది శ్రితా: !
అథ మర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే !!

హృదయంలో దాగి వున్న సకల వాంఛలు నిర్మూలించబడినప్పుడు మరణశీలియైన మానవుడు అమరుడవుతాడు. ఈ శరీరం వుండగానే బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు.

15. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయ: !
అథమర్త్యో మృతో భవత్యేతావద్ధ్యనుశాసనమ్ !!

ఇక్కడ.. ఈ శరీరంలో వుండగానే హృదయగ్రంథులన్నీ ఛేదించబడుతాయో అప్పుడు మర్త్యుడు అమరుడవుతాడు. ఇంతవరకూ సకల వేదాంతపు ఉపదేశం.

16. శతం చైకా హృదయస్య నాడ్య:
తాసాం మూర్ధానభిని: సృతైకా!
తయోర్ధ్యమాయన్న మృతత్వమేతి
విష్వంగన్యా ఉత్ర్కమణే భవంతి !!

హృదయానికి నూటొక్క కనాడులు వున్నాయి. వాటిలో ఒకటి మూర్థంవైపు వ్యాపించి వుంది. దానిద్వారా పైకిపోయి మానవుడు అమరత్వాన్ని పొందుతాడు. ఇతర నాడులు, ఇతర విధాలుగా ఉత్ర్కమణానికి దారితీస్తాయి.

17. అంగుష్ఠమాత్ర: పురుషోంతరాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్ట: !
త్వం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేన్ముంజాది వేషీకాంధర్వేణ
తంవిద్యాచ్చుక్రమమృతం తం విద్యాచ్చుక్రమమృతమితి !!

అంతరాత్మ అయిన పురుషుడు, బొటన వ్రేలంతవాడు సర్వదా ప్రాణుల హృదయాల్లో నివసిస్తూ వుంటాడు. శరీరంనుండి, అతణ్ణి గడ్డినుండి లోపల పోచనులాగా వేరుచేయాలి. అతడే పరిశుద్ధుడూ, అమరుడూ అని తెలుసుకోవాలి. అవును.. అతడే పరిశుద్ధుడూ.. అమరుడూ.

18. మృత్యుప్రోక్తాం నచికేతోథ లబ్ధ్వా
విద్యామేతాం యోగవిధిం చ కృత్స్నమ్ !
బ్రహ్మ ప్రాప్తో విరజోభూత్ విమృత్యు
రన్యోప్యేవం యో విదధ్యాత్మ మేవ !!

ఇలా యముడివద్ద జ్ఞానము, యోగవిధీ అంతటినీ సమగ్రంగా ఉపదేశం పొంది.. నచికేతుడు అన్ని మాలిన్యాలనుండి ప్రక్షళితుడై, మృత్యురహితుడై బ్రహ్మప్రాప్తినందాడు. ఆత్మను తెలుసుకున్న ఎవరైనా కూడా అలాగే బ్రహ్మప్రాప్తి పొందుతారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment