Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 4 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 7 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  4 🌻

🌷. ద్వితీయ వల్లి :

1. అన్యచ్ర్చేయో న్యదుతైవ ప్రేయ
స్తే ఉభే నానార్థే పురుషం సినీత: !
తయో: శ్రేయ: ఆదదానస్యసాధు
భవతి హీయతే ర్థాద్య ఉప్రేయోవృణీతే !!

శుభకరమైన శ్రేయస్సు ఒకటి పూర్తిగా తద్భిన్నమైన ప్రాపంచిన సుఖం మరొకటి. విభిన్న గమ్యాలకు తీసుకుపోయే ఈ రెండూ పురుషుని బంధించేవే. శ్రేయస్సును ఎన్నుకుని అనుసరించేవాడు గమ్యం నుండి పతనం చెందుతాడు.

2. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత
తౌ సంపరీత్య వివినక్తి ధీర: !
శ్రేయో హి ధీరో భి ప్రేయసో వృణీతే
ప్రేయో మందోయోగక్షేమాత్ వృణీతే !!

శ్రేయస్కరమైనదీ, సుఖకరమైందీ, ఈరెండూ మానవునికి సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి విచారిస్తాడు. సుఖకరమైన దానికంటే.. శ్రేయస్కరమైనదే మేలని ఎన్నుకుంటాడు. కానీ బుద్ధిహీనులు లోభంచేతా, ఆసక్తిచేతా సుఖకరమైన దాన్నే కోరుకుంటాడు.

3. స త్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామా
నభిధ్యాయన్ నచికేతో త్య స్రాక్షీ: !
నైతాం సృకాం విత్తమయీ మవాప్తో
యస్యాం మజ్జన్తి బహవో మనుష్యా: !!

నచికేతా! నువ్వు ప్రేమాస్పదమైన విషయాలనూ ప్రియంగా కనిపించే ప్రాపంచిక విషయాలనూ చక్కగా పరిశీలించి వాటన్నింటినీ పరిత్యజించావు. ఎందరో మానవులు మునిగి నశించే ప్రేయోమార్గంలో (సుఖభోగమార్గం) నువ్వు ప్రవేశించలేదు.

4. దూరమేతే విపరీతే విఘాచీ
అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా!
విద్యాభీప్సినం నచికేతసం మన్యే
నత్వాకామా బహవో లోలుపన్త !!

అజ్ఞానమూ, జ్ఞానమూ అనే ఈ రెండూ విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. అపారమైన అంతరం కలిగినవి. నచికేతుడు జ్ఞానాన్నే అన్వేషిస్తాడని నేను భావిస్తాను. ఎందుకంటే ఎన్ని విషయభోగాల ప్రలోభాలైనా నిన్ను చలింపచేయలేకపోయాయి.

5. అవిద్యాయామంతరే వర్తమానా:
స్వయం ధీరా: పండితం మన్యమానా: !
దంద్రమ్యమాణా: పరియన్తి మూఢా:
అంధేనైవ నీయమానా యథాంధా: !!

గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయిన మూర్ఖులు.. తామే ప్రజ్ఞావంతులూ, గొప్ప విద్వాంసులూ అనుకుంటూ.. గుడ్డివాళ్లచేత నడిపించబడే గ్రుడ్డివాళ్లలాగా తూలుతూ, తడబడుతూ సుడులు తిరుగుతూ వుంటారు.

6. న సాంపరాయా: ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం విత్తమోహేన మూఢమ్!
అయం లోకో నాస్తి పర ఇతి మానీ
పున: పునర్వశమాపద్యతే మే!!

జాగ్రత్తలేని బాలుడికి ధనమదంతో, మతిపోయిన వారికీ శ్రేయోమార్గం ఎప్పటికీ కనిపించదు. ‘‘ఉన్నది ఈ లోకమే.. మరో లోకం లేనే లేదు’’ అనుకునేవాడు మళ్లీమళ్లీ నా చేతిలో పడుతూ వుంటాడు.

7. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య:
శ్రణ్వంతో పి బహవో యం న విద్యు:!
ఆశ్చర్యోవక్తా కుశలో స్య లబ్ధా
శ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్ట:!!

దానిగురించి వినడం కూడా ఎంతోమందికి సాధ్యపడదు. దాని గురించి విన్నవారుకూడా ఎందరో దాన్ని గ్రహించలేరు. దానిని ఉపదేశించే ఆచార్యుడు, అద్భుతమైనవాడు శిష్యుడు కూడా, అలాగే అద్భుతమైన బుద్ధి తీక్షణత గలవాడు. సమర్థుడైన ఆచార్యుడు ఉపదేశించగా దాన్ని గ్రహించగలిగే శిష్యుడు నిజంగా అద్భుతమైనవాడు కదా!

8. న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చింత్యమాన:!
అనన్యప్రోక్తే గతిరత్ర నాస్త్య
ణీయాన్ హ్యతర్క్య మణుప్రమాణాత్ !!

అసమర్థుడైన పురుషుడు బోధించితే ఈ ఆత్మ ఏనాటికీ సవ్యంగా గ్రహించబడదు. ఎన్ని విధాలుగా ఆలోచించినా సరే. మరొకరు బోధించితే తప్ప.. దానికి వేరే దారి లేదు. సూక్ష్మ తమమైన దానికంటే అది సూక్ష్మతరమైంది. తర్కానికి లొంగనిది.

9. నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ!
యాం త్వమాప: సత్యధృతిర్బతాసి
త్వాదృఙ్ నో భూయాన్నచికేత: ప్రష్టా !!

నువ్వు పొందిన ఈ జ్ఞానం కేవలం తర్కమూ, చర్చల వల్ల లభించేది కాదు. ప్రియతమా, సమర్థవంత ఆచార్యుడు బోధించితేనే అర్థం అవుతుంది. నువ్వు అవశ్యం సత్యనిష్ఠ కలవాడివి. మీకు నీవంటి శిష్యులు లభిస్తారు గాక.

10. జానామ్యహం శేవధిరిత్యనిత్యం
న హ్యధ్రువై: ప్రాప్యతే హి ధ్రువం తత్ !
తతో మయా నాచికేతశ్చితో గ్ని
రనిత్యై ర్ర్దవ్యై: ప్రాప్తివానస్మి నిత్యమ్ !!

శాశ్వత వస్తువు అశాశ్వత వస్తువులచేత ఎన్నటికీ పొందబడదు కనుక.. ఈ సంపదలన్నీ అనిత్యాలని నాకు తెలుసు. అయినా ఈ అనిత్య వస్తువులతో నేను నాచికేతాగ్నిని నిర్వర్తించాను. తరువాత శాశ్వత వస్తువును పొందాను.

11. కామస్యాప్తిం జగత: ప్రతిష్ఠాం
క్రతోరనంత్య మభయస్య పారమ్!
స్తోమ మహదురుగాయం ప్రతిష్ఠాం దృష్ట్యా
ధృత్యా ధీరో నచికేతో త్య స్రాక్షీ: !!

సకలవాంఛల సంపూర్ణ పరిపూర్తినీ అన్ని యజ్ఞాదికర్మల శాశ్వత ఫలాన్ని అభయత్వపు అవ్వలిదరినీ ఆరాధ్యతమమూ, ఘనమూ వున్నతమైన స్థినీ జీవితాధారాన్నీ దీనినంతటినీ చూసికూడా ఓ నచికేతా ధీమంతుడవైన నువ్వు దృఢనిశ్చయంతో తిరస్కరించావు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment