🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 8 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కఠోపనిషత్ - 5 🌻
12. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్!
అధ్యాత్మయోగాధిగమేన దేవం
మత్వా ధీరో హర్షవోకౌ జహాతి!!
ఈ శరీరంలోనే వున్నదీ, హృత్పద్మంలో ఆసీనమై వున్నదీ, సనాతనమూ అతి సూక్ష్మమూ అంతర్లీనం, జ్యోతిర్మయం అయిన ఆ ఆత్మను ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకుని ధీశాలి సుఖదు:ఖాలకు అతీతుడవుతాడు.
13. ఏతచ్ర్చుత్వా సంపరిగృహ్యమర్త్య:
ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య
స మోదతే మోదనీయం హి లబ్ధ్వా
వివృతం సద్మ నచికేతనం మన్యే!!
ధర్మానికి ప్రాణమైన ఆ సూక్ష్యతత్త్వాన్ని విని.. తగిన విధంగా ఆలోచించి చక్కగా గ్రహించిన మానవుడు దానిని పొందుతాడు. ఆనందించదగిన దానిని పొందడంచేత ఆనందపరవశుడవుతాడు. నచికేతునికి ఇది తెరిచిన ఇల్లే అని నేను భావిస్తున్నాను.
14. అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా
దన్యత్రాస్మాత్ కృతాకృతాత్!
అన్యత్ర భూతా చ్చ భవ్యాచ్చ
యత్తత్పశ్యసి తద్వద!
నచికేతుడు ఇలా అంటాడు... ధర్మాధర్మాలకూ, కార్యకారణాలకూ, భూత భవిష్యత్తులకూ కూడా భిన్నంగా నువ్వు దేని సాక్షాత్కరించుకున్నావో దాన్ని దయచేసి నాకు ఉపదేశించు.
15. సర్వే వేదా యత్పదమామనంతి
తపాంసి సర్వాణి చ యద్వదంతి!
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తేపదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్!!
అన్ని వేదాలూ ఘోషించే గమ్యమూ, అన్ని తపస్సులూ ఉద్ఘాటించే గమ్యమూ అయినా.. దేన్నికోరి సాధువులు బ్రహ్మచర్య జీవితం గడుపుతారో దాన్ని సంగ్రహంగా చెపుతున్నాను విను. అదే ఓంకారం.
16. ఏతద్ధ్యే వాక్షరం బ్రహ్మఏతద్ధ్యే వాక్షరం పరమ్!
ఏతద్ధ్యే వాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్!!
ఈ అక్షరమే బ్రహ్మం. ఈ అక్షరమే సర్వోత్తమం కూడా. ఈ అక్షరాన్ని తెలుసుకున్నవారికి ఏది కోరితే అది సిద్ధిస్తుంది.
17. ఏతదాలంబనం శ్రేష్ఠమేతదాలంబనం పరమ్!
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే!!
ఈ ఆలంబనమే ఉత్తమమైంది. ఈ ఆలంబనమే సర్వత్కృష్టమైంది. దీని ఆలంబనాన్ని తెలుసుకుని బ్రహ్మలోకంలో పూజింపబడతాడు.
18. నజాయతే మ్రియతే వా విపశ్చి
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్!
అజో నిత్య: శాశ్వతో యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే!!
జ్ఞాత అయిన ఆత్మ పుట్టదు. అది చావదు కూడా. దేని నుంచి గానీ అది పరిణమించదు. దానినుండి కూడా ఏదీ పరిణామం పొందదు. శరీరం నశిస్తూ వున్నప్పుడు కూడా జన్మరహితమూ, అనశ్వరమూ, శాశ్వతమూ, సనాతనమూ అయిన ఈ ఆత్మకు నాశనమనేది లేదు.
19. హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతమ్!
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే!!
చంపేవాడు తాను చంపుతున్నానని. చంపబడినవాడు తాను చంపబడ్డానని భావిస్తే.. ఆ ఇరువురికీ ఆ ఆత్మ గురించి సరిగ్గా తెలియదు. నిజానికి అది చంపదు, చంపబడదు.
20. అణోరణీయాన్ మహతో మహీయా
నాత్మా స్య జంతోర్నిహితోగుహామాయ్!
తమక్రతు: పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మ హిమానమాత్మన: !!
సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటే చిన్నదీ అయిన బ్రహ్మాండం కన్నా ఘనమైంది ఐన ఆత్మ ప్రాణుల హృదయాలలోనే వుంది. కామనారహితుడు, శోకరహితుడై ఇంద్రియాల మనస్సు పవిత్రత ద్వారా ఆత్మ మహిమను సాక్షాత్కరించుకుంటాడు.
21. ఆసీనో దూరం వ్రజతి శయానోయాతి సర్వత: !
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి!!
కదలకుండా కూర్చునే వున్నా.. అతడు ఎంతోదూరం ప్రయాణిస్తాడు. పడుకునే వున్నా అతడు సకల ప్రదేశాలకూ పోతాడు. ఆనందమయుడూ, ఆనందరహితుడూ ఐన ఆ జ్యోతిర్మయుని నేను తప్ప ఎవరు తెలుసుకునే సమర్థుడై వున్నాడు.
22. అశరీరం శరీరేష్వన వస్థేష్వ వస్థితమ్!
మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి!!
శరీర రహితమూ, సర్వవ్యాపీ అయిన పరమాత్మను అస్థిరాలైన అన్ని శరీరాలనూ వున్న దానిని తెలుసుకుని ప్రజ్ఞావంతుడు శోకింపడు.
23. నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్య
స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్!!
వేదాధ్యయన చేతగానీ, బుద్ధి కుశలచతగానీ, అపారమైన పాండిత్యవల్లగానీ ఈ ఆత్మ పొందబడదు. అది ఎవరిని వరిస్తుందో.. ఎవరిని ఎన్నుకుంటుందో అతనిచేతే ఆత్మ పొందబడుతుంది. ఇది అంటే అతని ఆత్మే తన నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది.
24. నా విరతో దుశ్చరితాన్నాశాంతో నా సమాహిత:!
నాశాంతామానసో వా పి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్!!
చెడు నడతలనుండి విరమించనవారూ, ఇంద్రియ లౌల్యాన్ని నిగ్రహించుకోలేనివారూ, ధ్యానపరులు కానివారూ, ప్రశాంతి చెందిన మనస్సులేనివారు జ్ఞానం చేత కూడా దీనిని పొందగలరు.
25. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే; భవతి ఓదన:!
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర స:!!
లేకపోతే.. బ్రాహ్మణ, క్షత్రియులు ఎవరికి ఆహారమో, మృత్యువు ఎవరికి నంజుకునే పచ్చడో ఆ ఆత్మ ఎక్కడ వున్నదో ఎవరికి ఇలా తెలుసు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment