Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 2 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 5 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  - 2 🌻

11. యథాపురస్తాద్ భవితా ప్రతీత:
ఔద్దాలకి వారుణిర్మత్ర్పసృష్ట:
సుఖం రాత్రీ: శయితా వీతమన్యు:
త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తమ్ !!

యముడిలా అన్నాడు... నా ఆజ్ఞచేత ఔద్దాలకి ఐన నీ తండ్రి నిన్ను గుర్తిస్తాడు. నీతో పూర్వంలాగానే నీతో ప్రేమగా వుంటాడు. మృత్యుముఖం నుండి తప్పించుకున్న నిన్ను చూసి కోపంపోయి రాత్రులంతా సుఖంగా నిద్రించగలడు.
 
12. స్వర్గలోకే న భయం కించనాస్తి
న తత్ర త్వం న జరయా బిభేతి !
ఉభేతీర్త్వా శనాయాపిపాసే
శోకాతిగో మోదతే స్వర్గలోకే !!

(నచకేతుడిలా అన్నాడు)... స్వర్గలోకంలో ఎలాంటి భయము లేదు. మృత్యుదేవా ! నీవక్కడ లేవు. వృద్ధాప్యం వల్ల భయం లేదు. ఆకలిదప్పులను సకలదు:ఖాలను అతిక్రమించి మానవుడు స్వర్గలోకంలో సుఖంగా వున్నాడు.

 13. స త్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో
ప్రబ్రూహి తృంశ్రద్ధదానాయ మహ్యమ్ !
స్వర్గలోకా అమృతత్వం భజన్త
ఏతద్ ద్వితీయేన వృణేవరేణ !!

యమరాజా స్వర్గానికి తీసుకుపోయే ఆ యజ్ఞం నీకు తెలుసు. నేను శ్రద్ధావంతుడను (అందుచేత ఉపదేశానికి అర్హుడను.) నాకా యజ్ఞ విద్యను ఉపదేశించు. ఆ యజ్ఞంచేత స్వర్గకాములు అమరత్వం పొందుతారు. ఈ యజ్ఞరహస్యం నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను.

14. ప్రతే బ్రవీమి తదుమే నీబోధ
స్వర్గ్యమగ్నిం నచికేత: ప్రజానన్ !
అనంతలో కాప్తి మథో ప్రతిష్టాం
విద్ధి త్వమేతం నిహితం గుహాయామ్ !!

దానికి యముడు ఇలా బదులు చెప్పాడు. నచికేతా స్వర్గానికి తీసుకుపోయే ఆ అగ్ని యజ్ఞం; నాకు బాగా తెలుసు. నీకు చెబుతాను నేర్చుకో. ఆ విద్య శాశ్వతస్వర్గాన్ని పొందడానికి సాధన మనీ సకల జగత్తుకూ ఆధారమనీ విద్వాంసుల హృదయంలో నివసిస్తుందనీ తెలుసుకో.

15. లోకాదిమగ్నం తమువాచ తస్మై
యా ఇష్టకా యావతీర్వా యథావా !
స చాపి తత్ ప్రత్యవదద్యథోక్త
మథాస్య మృత్యు: పునరేవాహ తుష్ట: !!

నచికేతునికి యముడు జగత్తుకు మూలమైన ఆ అగ్నిని వివరించాడు. కావలసిన ఇటుకలు ఎన్నో ఎటువంటివో హోమనిధి ఎలా నిర్వహించాలో అంతా వివరంగా చెప్పాడు. శ్రద్ధగా విన్న నచికేతుడు అంతా మళ్లీ తిరిగి యముడికి చెప్పాడు. దానికి ఎంతో సంతోషించి యముడు మళ్లీ ఇలా అన్నాడు.

16. తమబ్రవీత్ ప్రీయమాణో మహాత్మా
వరం తవేహాద్య దదామి భూయ: !
తవైవ వామ్నా భవితా యమగ్ని:
సృంకాం చేమామనేక రూపాం గృహాణ !!

సంప్రీతుడైన ఆ యముడు నచికేతునితో ఇంకా ఇలా అన్నాడు. నీకు మరో వరం కూడా ఇస్తున్నాను. ఇకమీద ఈ అగ్ని నీ పేరిటనే ప్రసిద్ధమవుతుంది. ఇదిగో ఎన్నో రంగులున్న ఈ మాలను స్వీకరించు.

17. త్రిణాచికేతస్త్రి భిరేత్య సంధిం
త్రికర్మకృత్ తరతి జన్మమృత్యూ !
బ్రహ్మ జజ్ఞం దేవమీడ్యం విదిత్వా
నిచాయ్యేమాం శాంతిమత్యంతమేతి !!

ఈ నాచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసి ఉపదేశం కొరకు ముగ్గురిని ఆశ్రయించి మూడు రకాల విధులనూ నిర్వర్తించినవానికి చావు పుట్టుకలు వుండవు. బ్రహ్మము నుండి జన్మించినవాడూ దేదీప్యమానుడు సర్వజుడు ఐన అతణ్ణి, అగ్నిని గూర్చి తెలుసుకుని సాక్షాత్కరించుకుని పరమశాంతిని పొందుతాడు.

18. త్రిణాచికేతస్త్ర యమే తద్ విదిత్వా
య ఏవం విద్వాంశ్చినుతే నాచికేతమ్ !
స మృత్యుపాశావ్ పురత: ప్రణోద్య
శోకాతిగో మోదతే స్వర్గలోకే !!

నాచికేతయజ్ఞాన్ని మూడుసార్లు నిర్వర్తించిన ఆ ధీశాలి ఆ మూడింటినీ తెలుసుకుని నిర్వర్తిస్తాడు. అతడు శరీరపతనానికి ముందే మృత్యుపాశాలను ఛేదించి శోకాన్ని అతిక్రమించి స్వర్గలోకంలో సుఖం అనుభవిస్తాడు.

19. ఏషతే గ్నిర్నచికేత: స్వర్గ్యో
యమవృణీథా ద్వితీయేన వరేణ !
ఏతమగ్నిం తవైన ప్రవక్ష్యంతి జనాస
స్తృతీయం వరం నచికేతోవృణీష్వ !!

స్వర్గానికి తీసుకుపోయే ఈ నీ అగ్ని రెండవ వరంగా నువ్వు కోరుకున్న యజ్ఞం జనులచేత నీ పేరిటనే ఇక మీద పిలువబడుతుంది. నచికేతా ఇక నీ మూడవవరాన్నికోరుకో.

 20. యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
స్తీత్యేకే నాయమస్తీతి చైకే!
ఏతద్ విద్యామనుశిష్టస్త్వయాహం
వరాణామేష వరస్త్నతీయ: !

(నచికేతుడిలా అన్నాడు) మానవుడు మరణించాక వచ్చే సందేహమిది. చనిపోయిన వ్యక్తి వున్నాడని కొందరంటారు. మరికొందరు లేదంటారు. నువ్వు నేర్పితే దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక. నా వరాలలో ఇదే మూడవ వరం..
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment